News September 13, 2025

HYD: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

image

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.

Similar News

News March 29, 2026

WGL: విద్యా ప్రదాతకు దక్కని గౌరవం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలు నెలకొల్పిన ఇటికాల మధుసూదన్ రావుకు తగిన గౌరవం లభించడం లేదు. మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన సీఎం, పీఎం నెహ్రూను ఒప్పించి వరంగల్ నగరంలో నిట్, కేఎంసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు స్థాపించారు. ఏ విద్యాసంస్థలో కూడా కనీసం ఆయన స్మారకంగా విగ్రహం ఏర్పాటు చేయలేదు.
ఏ కళాశాలకు కూడా ఆయన పేరు పెట్టలేదు.

News March 29, 2026

ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

image

రహదారి ప్రమాదాల నివారణకు అధికారులు కలిసికట్టుగా పని చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రత కమిటీ (DRSC) సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలో రహదారి ప్రమాదాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి, ప్రమాదాలు అరికట్టలన్నారు.

News March 29, 2026

జహీరాబాద్: పన్నుల వసూళ్లలో వెనుకబాటు!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉంది. మొత్తం 22,172 నివాసాల నుంచి రూ. 23.58 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 6.24 కోట్లు (26.41%) మాత్రమే వసూలయ్యాయి. మరో మూడు రోజుల్లో రూ.17.14 కోట్లు వసూలు చేయాల్సి ఉందని కమిషనర్ జైత్ రామ్ తెలిపారు. గడువులోగా గృహ, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి సహకరించాలని ఆయన కోరారు.