News July 7, 2025

HYD: యుద్ధం ప్రకటించిన సందర్భం అది: సీఎం

image

టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజాపాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జూలై 7ను జీవితంలో మరచిపోలేనని సీఎం రేవంత్ రెడ్డి Xలో ట్వీట్ చేశారు.

Similar News

News July 7, 2025

మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

image

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.

News July 7, 2025

కొండమడుగు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

బీబీనగర్ మండలం కొండమడుగులో అక్రమాలపై కలెక్టర్ హనుమంత రావు సీరియస్ అయ్యారు. గ్రామపంచాయతీలో పలు అక్రమాలకు పాల్పడిన పంచాయతీ సెక్రటరీ అలివేలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల పంచాయతీ అధికారి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి మాజీద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు.

News July 7, 2025

కర్నూలు: నీటి పారుదల సలహా మండలితో కలెక్టర్ సమావేశం

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ (2025-26) పంటలకు నీటి విడుదలకు సంబంధించి జిల్లా నీటి పారుదల సలహా మండలితో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నీటి కొరత ఉండకుండా చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, జేసీ,సబ్ కలెక్టర్ ఉన్నారు.