News December 24, 2025
HYD: యువతలో కొత్త ట్రెండ్.. ‘మెంటీ బీ’!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువత తమ మానసిక ఒత్తిడిని వ్యక్తపరచడానికి ‘మెంటీ బీ’ (Mental Breakdown) అనే కొత్త పదాన్ని వాడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ ఆందోళనను నేరుగా చెప్పలేక, సరదాగా ‘చిన్న మెంటీ బీ వచ్చింది’ అంటూ స్నేహితులతో పంచుకుంటున్నారు. ఇది సహాయం అడగడాన్ని సులభతరం చేస్తున్నా, తీవ్రమైన మానసిక సమస్యలను కూడా తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 26, 2025
వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. వాడపల్లికి 4 వరుసల రోడ్డు!

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని 4వరుసలుగా విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ ఆధునిక రహదారిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
News December 26, 2025
అనంతపురంలో తుపాకుల సరఫరా గ్యాంగ్ అరెస్ట్

అనంతపురంలో తుపాకులు సరఫరా చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్లు SP జగదీశ్ వెల్లడించారు. ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 5 రివాల్వర్లు, 30 బుల్లెట్లు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇటీవల భార్యను తుపాకీతో బెదిరించిన భర్తపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ ముఠా గుట్టు చిక్కింది. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
News December 26, 2025
విద్యుత్ కష్టాలకు చెక్.. అయినవిల్లిలో భారీ సబ్‌స్టేషన్!

జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అయినవిల్లిలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్ మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లో-వోల్టేజ్ సమస్యలను అధిగమించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకే తలమానికంగా చేపడుతున్నట్లు తెలిపారు.


