News August 1, 2024
HYD: యువతికి న్యాయం.. సెల్యూట్ పోలీస్

యువతిని మోసం చేసి ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించిన నిందితుడి ఆట కట్టించిన మహంకాళి పోలీసులను CP శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. CI పరశురామ్ టీమ్‌కు క్యాష్ రివార్డ్ అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన <<1374121>>అమ్మాయితో స్వామికి FB<<>>లో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించగా నిందితుడిని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి, న్యాయం చేశారు.
Similar News
News March 11, 2025
HYD: పోలీసులను అభినందించిన సీపీ

బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణాను అరికట్టి బాధితులను ప్రజ్వల షెల్టర్ హోమ్‌కు తరలించిన ఘటనలో ప్రతిభ కనబరిచిన ఫిలింనగర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పంజాగుట్ట కానిస్టేబుల్ లావణ్యకు HYD సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో వీరు చూపిన శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.
News March 11, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News March 11, 2025
శంషాబాద్: నకిలీ పాస్ పోర్ట్.. వ్యక్తి అరెస్ట్

నకిలీ పాస్‌పోర్ట్‌తో వచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. గల్ఫ్ నుంచి నకిలీ పాస్‌పోర్టుతో స్వదేశానికి చేరుకున్న ఓ వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన శంకర్ 6 ఏళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. తిరిగి స్వదేశానికి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో వస్తున్న క్రమంలో భద్రతా అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు.