News January 25, 2026

HYD: యువతితో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్

image

రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకురాళ్లతో పాటు ఒక యువతిని అదుపులోకి తీసుకున్న ఘటన మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వినాయకనగర్ కాలనీలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని యువతులను రప్పిస్తూ శ్వేత, ఉమ వ్యభిచారం సాగిస్తున్నారు. ఈ సమాచారం మేరకు పోలీసులు రైడ్స్ చేశారు. ఇద్దరు నిర్వాహకురాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతిని రెస్క్యూ హోంకు పంపారు.

Similar News

News February 8, 2026

ఉప్పల్‌లో నేడు మెగా సెమినార్

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Convention‌లో నేడు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు

News February 8, 2026

బిల్లుల స్వీపింగ్: GHMCలో దోపిడీ!

image

నగర రోడ్లు క్లీన్ అవుతున్నాయో లేదో గానీ బడాబాబుల జేబులు ఫుల్ అవుతున్నాయి!. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల పేరుతో నెలకు రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతోంది. అసలు 30 మెషీన్లు షెడ్డు దాటకుండానే GPS డేటాను ట్యాంపర్ చేసి బిల్లులు దండుకుంటున్నారు. ఇది GHMC ఇంటర్నల్ విచారణలో తేలినట్లు టాక్. నెలకు రూ. 12 కోట్ల బడ్జెట్‌లో సింహభాగం కాంట్రాక్టర్లు, అధికారుల పాలవుతున్నట్లు GHMC బాస్ దృష్టికి వచ్చినట్లు సమాచారం.