News April 23, 2025
HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.
Similar News
News April 23, 2025
2PM: HYDలో 78.57% పోలింగ్

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలను పోలింగ్ ముగియనుంది.
News April 23, 2025
ఓయూ భవనానికి ట్రేడ్ మార్క్ గుర్తింపు

ఉస్మానియా యూనివర్సిటీ ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో నిర్మాణ శైలి చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్‌హోటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన 3వ కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది.
News April 23, 2025
HYDలో మరోసారి ఎలక్షన్‌కు BRS దూరం

ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో BRS సభ్యులెవరూ ఇప్పివరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకే నేతలందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికకు మరో 2 గం. వ్యవధి ఉంది. ఫిబ్రవరిలో GHMC స్టాడింగ్ కమిటీ ఎన్నికకు BRS దూరంగా ఉండగా మరోసారి HYD స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి తప్పుకుంది. రాష్ట్రవ్యాప్తంగా BRSకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పటికీ GHMCలో మాత్రం ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు.