News March 29, 2024

HYD: రంజాన్ జోష్.. అత్తర్లకు క్రేజ్

image

రంజాన్ నేపథ్యంలో పాతబస్తీలో అత్తర్ల
అమ్మకాలు జోరందుకున్నాయి. పాతబస్తీ అనగానే మొదటగా గుర్తొచ్చేది వీటి పరిమళాలే. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు లభిస్తున్నాయి. ఇక్కడి దుకాణాల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన అత్తర్లతో పాటు సింథటిక్ అత్తర్లు లభిస్తున్నాయి. 10 మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు ఈ పండగ సీజన్లో వెనువెంటనే అమ్ముడవుతున్నాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News July 8, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రామంతపూర్:వన మహోత్సవం ప్రారంభించిన మంత్రులు
✓మేడ్చల్: డ్రగ్స్ తీసుకున్న 12 మంది పై కేసు నమోదు
✓కంటోన్మెంట్ GHMCలో కలిస్తే నష్టమే:రామకృష్ణ
✓గచ్చిబౌలి: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
✓HYD: 7 నెలల్లో పింఛన్ అందింది రెండుసార్లే!: బిక్షపతి
✓HYD: నిరుద్యోగుల కన్నెర్ర.. చీకట్లోనూ నిరసనలు
✓గోల్కొండ: రెండవ రోజు కొనసాగిన బోనాలు

News July 8, 2024

HYD: డ్రగ్స్ సేవించిన 12 మందిపై కేసు 

image

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన పోలీసులు చర్యలుంటాయన్నారు.

News July 8, 2024

గచ్చిబౌలి: స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో పాల్గొన్న సీఎం

image

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.