News April 9, 2024
HYD: రంజాన్ స్పెషల్.. అత్తర్ల పరిమళాలు
పవిత్ర రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే కొనుగోలుదారులతో హైదరాబాద్ పాతబస్తీలోని దుకాణాలు కళకళలాడుతున్నాయి. గులాబీ రేకులు, మల్లె, మొగలిపూలు, గంధం చెక్కలు మరిగించటం ద్వారా వచ్చే ఆవిరితోనే అత్తర్లను తయారుచేస్తారు. 200లకు పైగా వివిధ రకాల ఫ్లేవర్లు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.40 నుంచి రూ.600 వరకు దొరుకుతున్నాయి.
Similar News
News November 25, 2024
గ్రేటర్ పరిధిలో మిగిలింది 25 % కుటుంబాలే..
గ్రేటర్ HYDలో ఎన్యుమరేటర్లు సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 75% సర్వే పూర్తయింది. 18,26,524 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించారు. వీలైనంత త్వరగా మిగిలిన 25% ఇళ్లల్లో సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సర్వేలో ఎలాంటి తప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
News November 25, 2024
HYD: కుల గణనపై ఎంపీ ఈటల అభిప్రాయం ఇదే!
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కులగణనపై తన అభిప్రాయం వెల్లడించారు. కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో క్యాటగిరీలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో కులగణన లెక్కలు కేంద్ర పరంగా ఉండటం కంటే, రాష్ట్రాలపరంగా తీస్తేనే సముచితంగా ఉంటుందన్నారు. HYD కొత్తపేటలో కులగణన శాస్త్రీయ అవగాహన ప్రోగ్రాంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, అంతరాలు లేని సోషలిజం బతుకు నెరవేరలేదన్నారు.
News November 25, 2024
HYD: సైకిళ్లపై రాచకొండ పోలీసుల పెట్రోలింగ్..!
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చర్లపల్లి, ఉప్పల్, కందుకూరు, ఎల్బీనగర్ సహా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిళ్లపై వెళ్లి ప్రజలు, యువతను కలిసి యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, డయల్ 100, ఉమెన్ సేఫ్టీ, సోషల్ మీడియాలో మోసాలపై వివరిస్తున్నారు. మహిళా పోలీసులు సైతం ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.