News April 1, 2024

HYD: రంబుల్ స్ట్రిప్స్‌పై మీ అభిప్రాయం ఏంటి..?

image

HYD ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గచ్చిబౌలి, నాగోల్, చాంద్రాయణగుట్ట, హయత్‌నగర్ తదితర చోట్ల రోడ్లపై వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసేందుకు ఇలా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. అయితే తక్కువ దూరంలో రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు అధిక మందంతో ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు. వయసు పెరిగేకొద్దీ వెన్నుపూస సమస్యలు వస్తున్నాయంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి..?

Similar News

News January 14, 2025

HYD: అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం: హరీశ్

image

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. బెయిలబుల్ సెక్షన్స్‌లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పండగపూట డెకాయిట్‌ని, టెర్రరిస్ట్‌ని అరెస్టు చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

News January 14, 2025

రంగారెడ్డి జిల్లాలో నమోదు అవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాచులూరు, ఎలిమినేడులో 13.1℃, రెడ్డిపల్లె 13.3, మీర్‌ఖాన్‌పేట 13.5, చందనవెల్లి 13.6, తాళ్లపల్లి, అమీర్‌పేట, మంగళపల్లె 13.7, వైట్‌గోల్డ్ SS, కేతిరెడ్డిపల్లి 13.9, కందువాడ 14, షాబాద్ 14.3, రాజేంద్రనగర్, గునగల్ 14.4, కొత్తూరు 14.5, ప్రొద్దుటూరు, యాచారం, తొమ్మిదిరేకుల, ఆరుట్ల 14.6, కాసులాబాద్, నందిగామలో 14.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 14, 2025

HYD: బస్ స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!

image

HYDలోని గచ్చిబౌలి, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో ఇప్పటికీ పలువురు గ్రామాలకు వెళ్తున్నారు. నేడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొంత మంది నేడు ఉదయం ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో బస్ స్టేషన్లలో కొద్దిమేర రద్దీ నొలకొంది. నేడు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలులో ఉండదని అధికారులు తెలిపారు. సాధారణంగా ఉండే బస్సుల్లోనే తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.