News July 18, 2024

HYD: రక్తం మరిగిన కుక్కలు.. కారణం ఇదేనా?

image

గ్రేటర్ HYDలో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం <<13652139>>కుక్క కాటు కేసులు<<>> నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్‌ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News August 27, 2025

ఖైరతాబాద్ గణేశ్ క్యూ లైన్‌లో మహిళకు ప్రసవం

image

ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం వెళ్లిన మహిళ ఉ.6 గంటలకు క్యూ లైన్‌లోనే ప్రసవించింది. ఆమె రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

News August 27, 2025

అత్యధికంగా శేరిలింగంపల్లిలో 4CM వర్షపాతం

image

HYDలో నిన్న సాయంత్ర కురుస్తున్న వర్షానికి భారీగా వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లిలో ఏరియాలో 4 CM, రామచంద్రపురం 3.5, కుత్బుల్లాపూర్‌లో 2.9, పటాన్‌చెరు 2.9, కూకట్‌పల్లిలో 2.7, షేక్‌పేట్‌లో 2.4, ముషీరాబాద్ 2.3, కాప్రాలో 2.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

News August 27, 2025

HYD: చూడబోతే అడవి.. కొనబొతే కొరివి

image

HYD బిగ్గెస్ట్ పండుగ గణేశ్ ఉత్సవాలు షురూ అయ్యాయి. RR, మేడ్చల్, HYD జిల్లావ్యాప్తంగా పూలు, పండ్లు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. చామంతి పూలు కేజీ ₹600-800 మధ్య తూగుతోంది. బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు, అరటి డజన్ రూ.40- 60కి పెంచారు. బత్తాయి, యాపిల్, దానిమ్మ, జామ వంటి పూజలో ఉపయోగించే పండ్ల ధరలు రెట్టింపు చేశారు. దీంతో పండుగ వేళ కొనక తప్పదని కొనుగోలు చేస్తున్నారు.