News April 3, 2024

HYD: రసూల్‌పురలో యువకుడి హత్య

image

HYD బేగంపేటలోని రసూల్‌పుర అంబేడ్కర్‌నగర్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 2, 2026

HYD: నీటిలో మురుగు.. జలమండలికి ఉరుకు!

image

నగర తాగునీటిలో కాలుష్య సెగ తగలకుండా జలమండలి ‘బస్తీ బాట’ పట్టింది. పైపులైన్లు లీకై మురుగునీరు కలిస్తే కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించడంతో అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. రోజూ 5 వేల శాంపిల్స్ పరీక్షలు చేస్తున్నా, పురాతన పైపులైన్ మార్పు జలమండలికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్రమ కనెక్షన్లే కాలుష్యానికి కేంద్రాలని గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నారు.

News March 2, 2026

HYD: నిరుద్యోగులకు అలర్ట్.. త్వరలో నోటిఫికేషన్

image

మహానగర తాగునీటి సరఫరా బలోపేతానికి HMWSSB ఆధ్వర్యంలో మంజీరా, గండిపేటకు మరో రెండు పైపులైన్‌లు వేయాలని నిర్ణయించారు. HYDలో 300 వార్డులకు విస్తరించిన వేళ పని భారం మోసేందుకు అధికారులు అవసరం కానున్నారు. దీంతో 136 మేనేజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు ఇప్పటికే ఇంజినీర్లు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు

News March 2, 2026

HYD: లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు మీవే..!

image

కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’కు విశేష స్పందన లభిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన వధువు లేదా వరుడు ఉన్న జంటలకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 13,419 జంటలకు సుమారు రూ.238 కోట్లకు పైగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు.