News December 1, 2024

HYD: రహదారులపై మతాల చిహ్నాలు తొలగించాలి: సంఘ సేవకులు

image

రహదారులపై వివిధ మతాల చిహ్నాలు రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడి నుంచి తరలించాలని ప్రముఖ సంఘ సేవకులు గంజి ఈశ్వర్ లింగం, టీ.రమేశ్ కోరారు. సిటిజన్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రహదారులపై ఆటంకాలు, ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై ప్రత్యేక సమావేశం కమలానగర్‌లో ఆదివారం నిర్వహించారు. కోమటిరవి, యాదగిరిరావు, కర్రం మల్లేశం ఉన్నారు.

Similar News

News September 17, 2025

జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.

News September 17, 2025

HYD: ఆపరేషన్ పోలోకు తక్షణ కారణం ఏంటంటే?

image

1948 SEP 10న నిజాం UNOలో భారత్‌పై ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ పోలోకు తక్షణ కారణమైంది. భారత్ HYD సంస్థానాన్ని ఆక్రమించబోతోంది, యథాతద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్దార్ పటేల్ కఠిననిర్ణయం తీసుకున్నారు. SEP13న బలగాలు HYD వైపు బయలుదేరాయి. SEP 17న నిజాం లొంగిపోయారు. ఒక దేశం మరొక దేశంపై దండెత్తడం చట్టవిరుద్ధమని, సైనిక ఖర్చును వైద్యశాఖ ఖాతాలో వేశారు. HYD సంస్థానం విలీనం అయింది.