News October 10, 2025

HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్..15,641 కేసులు నమోదు

image

సైబరాబాద్ పోలీసులు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై 15,641 కేసులు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు రూ.72,02,900 జరిమాణాలు విధించినట్లు వెల్లడించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదానికి ముప్పు అని తెలిపారు.

Similar News

News October 10, 2025

గ్రూప్-1 ర్యాంకర్‌ను సన్మానించిన HYD కలెక్టర్

image

గ్రూప్-1 ద్వారా ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌గా ధనసిరి దివ్య ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవారం లక్డికాపూల్‌లోని కలెక్టరేట్‌‌లో ఆమెను సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగ సాధన అభినందించి, దివ్యని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

News October 10, 2025

గచ్చిబౌలిలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

image

గ్రేస్ క్యాన్సర్ రన్ నేపథ్యంలో ఆదివారం గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.5:30 నుంచి 8:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. 10 కిలోమీటర్ల ఈ పరుగు గచ్చిబౌలి మెయిన్ స్టేడియం నుంచి IIIT జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా సాగుతుందన్నారు. విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను వేరే దారిలో మళ్లించనున్నట్లు తెలిపారు.

News October 10, 2025

HYD: ఫైర్ క్రాకర్ విక్రేతలతో డీసీపీ శిల్పవల్లి సమీక్ష

image

దీపావళి పండుగను పురస్కరించుకుని ఫైర్ క్రాకర్ దుకాణదారులతో శుక్రవారం HYD సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, IPS ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిప్రమాదాల నివారణ చర్యలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ ఆనంద్, జోన్ ఏసీపీలు, సీఐలు, సిబ్బంది ఉన్నారు.