News October 11, 2025

HYD: రాచకొండ పరిధిలోనే అత్యధిక నేరాలు..!

image

2023 ఏడాదికి సంబంధించి NCRB రిపోర్టు విడుదల చేసింది. TGలో నమోదైన నేరాలు 1,56,737 కాగా అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,289, ‘సైబరాబాద్’లో 22,398 ‘హైదరాబాద్’లో 21,774 నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలను పొందుపరిచి, కొన్ని కేసులకు సంబంధించిన కారణాలను సైతం వివరించింది.

Similar News

News October 11, 2025

HYD: జిల్లా అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు..!

image

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల భర్తీకి తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్‌ కమిటీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇవాళ్టి నుంచి డీసీసీ అధ్యక్ష పదవులకు దరఖాస్తులను అధిష్ఠాన పెద్దలు స్వీకరించనున్నారు. వారం రోజులపాటు ఏఐసీసీ పరిశీలకులు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షులను బలమైన నేతలు పెట్టేందుకు ఏఐసీసీ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తుంది.

News October 11, 2025

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం అధికారులు 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను భద్రపరిచేందుకు యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.

News October 11, 2025

HYD: రూ.1,100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

image

HYDలోని ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను శుక్ర‌వారం హైడ్రా తొల‌గించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో క‌బ్జాల నుంచి ప్ర‌భుత్వ భూమికి విముక్తి క‌ల్పించింది. 12.50 ఎక‌రాల మేర ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ.1,100 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 10లో మొత్తం 5 ఎక‌రాల మేర ఉన్న క‌బ్జాల‌ను తొల‌గించింది. ఇక్క‌డ ఈ భూమి విలువ రూ.750 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని భావిస్తున్నారు.