News July 19, 2024

HYD: రాచకొండ పోలీసుల కష్టాలు

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు (AR) విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఖైదీలను రంగారెడ్డి జిల్లా కోర్ట్‌లో హాజరుపరుస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు కనీస వసతులు కూడా లేక ఇలా రోడ్ పైనే భోజనం చేస్తున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో పోలీసులకు డైనింగ్ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతున్నారు.

Similar News

News February 20, 2026

HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

image

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్‌(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్‌ ఒప్పుకున్నాడు.

News February 20, 2026

హైదరాబాద్‌లో ₹25వేల శాలరీతో జాబ్స్

image

ECIL HYDలో 200 పోస్టులు భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు BTechలో 60% మార్కుల ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 24న ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు ₹25,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/jobopenings చూడండి.

News February 20, 2026

HYD: మోగనున్న పెళ్లి బాజాలు.. వాటికి ఫుల్ డిమాండ్

image

డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను చాలావరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. దీంతో HYD, ఉమ్మడి రంగారెడ్డిలోని ఫంక్షన్ హాళ్లు, వివాహాలకు సంబంధించి కొనుగోళ్లతో వస్త్ర, బంగారు దుకాణాలలో రద్దీ పెరిగింది. ముహూర్తాలు మొదలు కావడంతో డెకరేషన్, ఫొటోగ్రఫి, ఈవెంట్లు నిర్వాహకులు తీరిక లేకుండా ఉన్నారు.