News December 29, 2025

HYD: రాచకొండ ఫిలిం సిటీ ముచ్చటేది..!

image

రాచకొండలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్రం వచ్చాక 2014 డిసెంబర్‌లో KCR సర్కార్ చెప్పింది. సీఎం స్వయంగా ఏరియల్ సర్వే కూడా చేశారు. అక్కడి 33 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫిల్మ్ సిటీకి 2వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీనిపై నిర్ణయం తీసుకుంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News February 20, 2026

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

News February 20, 2026

రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

image

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.

News February 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.