News April 9, 2025
HYD: రాజాసింగ్‌పై 3 సెక్షన్ల కింద కేసులు

గోషామహల్ MLA రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.
Similar News
News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
News April 17, 2025
సిజేరియన్ డెలివరీలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

కోఠిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవిలో గర్భిణులు, బాలింతల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
News April 17, 2025
OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.