News March 7, 2025

HYD: రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

HYDలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 10.5 డిగ్రీలకు పడిపోయాయి. రాజేంద్రనగర్‌లో 12.5, హయత్‌నగర్‌లో 17, దుండిగల్‌లో 16.1 నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా.. మధ్యాహ్నం వీపు పగిలేట్లు 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News July 6, 2025

ములుగు జిల్లాలో 36.00 మి.మీ వర్షపాతం

image

ములుగు జిల్లాలో ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 12.2, ములుగు 4.4, గోవిందరావుపేట 9.8, తాడ్వాయి 2.6, వాజేడు 1.6, వెంకటాపురం 1.2, మంగపేటలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 4.2గా ఉంది.

News July 6, 2025

CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల

image

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాలను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. <>https://icai.nic.in/caresult/<<>> వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలు మేలో జరిగాయి. ఇందులో పాస్ కాని వారు సెప్టెంబర్‌లో జరిగే ఎగ్జామ్స్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 18తో ముగియనుంది.

News July 6, 2025

వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత పరిశీలన

image

వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత అమలు తీరును పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, వాష్ రూమ్స్, పాఠశాల పరిసరాలు, తరగతి గదుల పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. పరిశుభ్రతపై తనిఖీ చేసేందుకు బృందాలు త్వరలోనే పర్యటించనున్నారు. జిల్లాలో 1,108 పాఠశాలలో ఉండగా, 82,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.