News October 24, 2025

HYD: రామంతాపూర్‌లో బెట్టింగ్‌లకు బలైన డిగ్రీ విద్యార్థి

image

HYD రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అరుణ్(18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి రజిత ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 24, 2025

ఓయూలో ఫలితాల విడుదల

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
SHARE IT

News October 24, 2025

HYD: KTRకు పిచ్చి లేసింది: చనగాని

image

KTR పొగరుబోతు మాటలు మానుకోవాలని TPCC జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. అధికారం అంధకారం అయ్యాక KTRకు పిచ్చి లేసిందని విమర్శించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై KTR వ్యాఖ్యలు సరికాదని, సీఎం, మంత్రులపై విమర్శలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజాపాలన రాష్ట్రానికే కాదు.. దేశానికి ఆదర్శమైందని చెప్పుకొచ్చారు. CMపై ఇష్టానుసారం మాట్లాడొద్దన్నారు.

News October 23, 2025

ఓయూలో రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ ఎంసీఏ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 27వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.