News March 4, 2025

HYD: రాయదుర్గంలో యువతి సూసైడ్

image

రాయదుర్గంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25), సతీశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ మనస్తాపంతో దేవిక ఉరివేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 4, 2025

INDvAUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

News March 4, 2025

అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

image

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్‌ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్‌లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.

News March 4, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

నిజాంసాగర్‌కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!