News December 19, 2025

HYD: రాష్ట్రపతి రాక..నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు..!

image

నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ మీదుగా వెళ్లనుండగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారు. నాగోల్ మూసి బ్రిడ్జి నుంచి, జెన్ పాక్ట్ వరకు జంక్షన్లు, యూటర్న్ ఉదయం 8 నుంచి సా.4:30 వరకు ముసి ఉంచటం, డైవర్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News December 26, 2025

శ్రీకాకుళం జిల్లా 104లో ఉద్యోగాలు

image

ప్రభుత్వం భవ్య ద్వారా నిర్వహిస్తున్న 104 చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని శ్రీకాకుళం జిల్లా అధికారి నరసింహమూర్తి శుక్రవారం తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఈనెల 27, 28 తేదీల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 26, 2025

మృత్యువుతో పోరాడి వేలమందిని కాపాడిన కామారెడ్డి పోలీసులు!

image

కామారెడ్డి జిల్లాను ఈ ఏడాది ముంచెత్తిన భారీ వర్షాల్లో పోలీస్ శాఖ మానవత్వాన్ని చాటుకుంది. వరద ఉధృతిలో చిక్కుకున్న 1,251 మందిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో 2,478 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి అండగా నిలిచారు. వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న NH-44 జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌ను పోలీసులు చాకచక్యంగా క్రమబద్ధీకరించారు. అహోరాత్రులు శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

News December 26, 2025

సూర్యవంశీకి ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’

image

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(14)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వీర్ బాల్ దివస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్‌లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది 18 రాష్ట్రాల నుంచి 20 మంది పిల్లలు దీనికి ఎంపికయ్యారు.