News November 11, 2025

HYD: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి BRS ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని BRS ప్రతినిధుల బృందం HYD BRK భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.

Similar News

News November 11, 2025

HYD: సీఎం ప్రజావాణిని సందర్శించిన అధికారులు

image

సీఎం ప్రజావాణిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో సమస్యల పరిష్కారంలో అమలు చేస్తున్న తీరును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని పాల్గొన్న అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న వైఖరిని అధికారులు ప్రజావాణి ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

News November 11, 2025

జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్‌కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.

News November 11, 2025

జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్‌లో మహిళా ఓటర్ల క్యూ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన షేక్‌పేటలోని సక్కు బాయి మెమోరియల్ హైస్కూల్ మోడల్ పోలింగ్ స్టేషన్ నం.19లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఓటు వేయడానికి వరుసలో నిల్చున్నారని, ఇది ప్రజాస్వామ్యం ఫరిడవిల్లునట్లే అని CEO_Telangana ట్వీట్ చేసింది.