News September 12, 2025

HYD: రాష్ట్ర చిహ్నాలతో రాస్తాకు అందం

image

కూడళ్ల వద్ద ఎక్కువగా మహనీయుల విగ్రహాలే వెలిగిపోతుంటాయి. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌లో ఈ దృశ్యం విభిన్నంగా మెరిసిపోతోంది. TG గౌరవ చిహ్నాలను శిల్పకళాఖండంగా ప్రతిష్ఠించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇరువైపులా TG రాష్ట్ర జంతువులు మచ్చల జింకలు, మధ్యలో రాష్ట్ర పక్షి పాలపిట్ట సోయగం విరజిమ్ముతూ కనువిందు చేస్తోంది. ప్రయాణికుల చూపులను కట్టిపడేస్తోంది. మనసు దోచేస్తోంది.

Similar News

News September 12, 2025

రాష్ట్రంలో ఎరువులకు కొరతలేదు: మంత్రి

image

రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుపుతున్నామన్నారు.

News September 12, 2025

వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి

image

అనంతపురం జిల్లా వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

News September 12, 2025

కరీంనగర్‌లో ఈనెల 17న జాబ్ మేళా

image

నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్‌లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ.20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, వివరాలకు 9052259333, 9944922677, 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించాలని కోరారు.