News September 4, 2024
HYD: రాహుల్ ద్వంద్వ వైఖరి: కేటీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.
Similar News
News February 27, 2026
మేడ్చల్: వృద్ధుడికి సెంచరీ సెలబ్రేషన్స్.. అంతలోపే

ఆయనకు నిండునూరేళ్లు నిండాయి. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేద్దామని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అంతలోనే ఆ వృద్ధుడు మృతిచెందారు. బీదర్‌కు చెందిన దొండచార్య జోషి(100) బోడుప్పల్ గాయత్రినగర్‌లో స్థిరపడ్డారు. బీదర్ HYD సంస్థానంలో ఉన్న సమయంలో రజాకార్ల దౌర్జన్యంపై ఈయన దండెత్తారు. KA, MH రాష్ట్రాల విభజనలో పాల్గొన్నారు. గతేడాది బోడుప్పల్‌లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో 99వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
News February 27, 2026
HYD: ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ.10ల కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటకు పొక్కింది. కాగా ప్రభుత్వం దోమల నివారణకు ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది.
News February 27, 2026
HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.


