News January 16, 2026

HYD: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇంటికే!

image

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై RTA కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త సాఫ్ట్‌వేర్ అమలుకు HYD యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. వాహనదారుడు షోరూమ్‌లోనే డీలర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డైరెక్ట్‌గా పోస్టు ద్వారా ఇంటికే చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమయం, శ్రమ ఆదా చేసే విధానమని తెలిపారు.

Similar News

News February 2, 2026

జకోవిచ్.. ఆ టైటిల్ ఎప్పుడు నెగ్గుతాడో?

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో జకోవిచ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన 10సార్లూ జకోవిచ్ విజయం సాధించారు. నిన్న జరిగిన ఫైనల్లోనూ గెలిచి, 25వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లు చల్లారు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత ఈ సెర్బియా వీరుడు ఒక్క సింగిల్ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌నూ గెలవలేదు.

News February 2, 2026

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

image

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 2, 2026

MHBD: పుర పోరు.. ‘బుజ్జగింపులు ‘ షురూ..!

image

మహబూబాబాద్ జిల్లాలో నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండటంతో MHBD, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం లాంటి మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నుంచి ఆశావహులు తలనొప్పిగా మారింది.