News March 23, 2026
HYD: రియల్ ఎస్టేట్‌పై మూసీ బ్యూటిఫికేషన్ ఎఫెక్ట్..!

మూసీ సుందరీకరణ పేరుతో సర్కార్ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌ను వణికిస్తున్నాయి. సుమారు 1200 సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో సైలెంట్‌గా బ్లాక్ చేసేశారని సమాచారం. ఇందులో దాదాపు 450వరకు భారీ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. FTL, బఫర్ జోన్ల సాకుతో సబ్-రిజిస్ట్రార్లకు అంతర్గత ఆదేశాలు జారీ కావడంతో రిజిస్ట్రేషన్లు ఆగాయి. ప్రభుత్వం అండర్ గ్రౌండ్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.