News March 18, 2026

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

TODAY HEADLINES

image

⋆ 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు: మోదీ
⋆ డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: రేవంత్
⋆ ఈ నెల 22 నుంచి TGSRTC సమ్మె
⋆ TG TET, DOST నోటిఫికేషన్ విడుదల
⋆ ఎండలు.. రేపు 12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA
⋆ AP: మే 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
⋆ IPL: RRపై SRH విజయం

News April 14, 2026

చిరునామా వెతికి మరీ.. బాధితురాలికి బ్యాగ్ అందజేత

image

కాకినాడకు చెందిన రోకళ్ల లలితాంబిక సోమవారం ఆటోలో ప్రయాణిస్తూ టౌన్ హాల్ వద్ద బ్యాగ్ పోగొట్టుకున్నారు. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ RSI బి వి సత్యనారాయణ, సిబ్బంది ఆ బ్యాగ్ గమనించి చిరునామా ఆధారంగా ఆమెకు అందజేశారు. బ్యాగులో నగదు, సెల్‌ఫోన్ ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. సిబ్బంది నిజాయితీని జిల్లా SP బిందుమాధవ్ అభినందించారు. స్థానికులు పోలీసుల సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు.

News April 14, 2026

రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్

image

IPLలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 57 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. భీకర టాపార్డర్ కాస్తా తొలి ఓవర్‌లోనే కుప్పకూలగా.. ఫెరీరా (69), జడేజా (45) వందకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. చివరికి 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. వైభవ్, జురెల్, ప్రిటోరియస్ డకౌట్ కాగా, జైస్వాల్(1), పరాగ్(4) విఫలమయ్యారు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీశారు.