News April 7, 2024
HYD: రూ.13,13,950 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13,13,950 నగదు, రూ.2,34,159 విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు.
Similar News
News September 10, 2025
జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి ఫిక్స్?

జూబ్లీహిల్స్ నుంచి BRS తరఫున మాగంటి సతీమణి సునీతను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన రహమత్‌నగర్ బూత్ కమిటీ మీటింగ్‌లో KTR పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని టాక్. ‘శ్రీమతి సునీత గారికి ప్రజల ఆశీర్వాదం ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ధీమాతోనే మాగంటి ఇంటిల్లి పాది విస్రృత పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థిత్వంపై అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News September 10, 2025
HYD: ప్రచార బరిలోకి మాగంటి కూతుళ్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మాగంటి బాటలోనే ఆ ఫ్యామిలీ అంతా గెలుపు కోసం ప్రజల్లోకి వెళుతోంది. గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర ప్రచార బరిలోకి దిగారు. 3 రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తూ సెగ్మెంట్ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు బూత్ నాయకులతో మీటింగ్‌లు పెట్టి సమన్వయం చేసుకొంటున్నారు. కాగా, BRS టికెట్ మాగంటి సునీతకే ఇస్తారని తెలుస్తోంది.
News September 10, 2025
కర్మన్‌ఘాట్ గుడి పులిహోర వివాదం.. EO వివరణ

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో కుళ్లిన <<17658707>>పులిహోర ప్రసాదం<<>> పంపిణీ అయిందన్న వార్తల్లో నిజం లేదని ఆలయ EO లావణ్య స్పష్టం చేశారు. రోజూ ప్రసాదం తయారు చేసి అందజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయబోమని తెలిపారు. కొంతమంది కావాలనే ఆలయ ప్రతిష్ఠను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.