News March 19, 2024

HYD: రూ.16,43,300 నగదు పట్టివేత: కమిషనర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్ టీమ్స్ మంగళవారం రూ.16,43,300 నగదుతో పాటు రూ.10,250 విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీస్, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 29, 2024

మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లలేదా.. నేడే ఆఖరు!

image

చినిగిన చొక్కా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక మంచి పుస్తకం కొనకుంటే, నీ జీవితమంతా అజ్ఞానమే అన్నారు మరికొందరు మేధావులు. అందుకేనేమో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బుక్ ఫెయిర్ – 2024 నిరంతరం పుస్తక ప్రియులతో నిండుగా కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. మరి మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లారా..? అక్కడ ఏ పుస్తకం కొన్నారో కామెంట్ ప్లీజ్..!

News December 29, 2024

జూబ్లీహిల్స్‌లో 4 పబ్‌లకు అనుమతి లేదు!

image

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.

News December 29, 2024

హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు!

image

గడచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోండామార్కెట్ 18.2℃, వెస్ట్ మారేడ్పల్లి, షేక్‌పేట, రియాసత్‌నగర్ 18.4, కంచన్‌బాగ్, చంద్రయాన్ గుట్ట 18.7, జూబ్లీహిల్స్, గోల్కొండ 18.8, ఓయూ 18.9, షేక్‌పేట, అడిక్‌మెట్, మెట్టుగూడ, బంజారాహిల్స్ 18.9, బౌద్ధ నగర్, తిరుమలగిరి, బండ్లగూడ 19, లంగర్‌హౌస్, కందికల్ గేట్, బోరబండ 19.2, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, చిలకలగూడలో 19.3℃గా నమోదైంది.