News September 22, 2025
HYD: రూ.2 కోట్లు పోగొట్టుకున్న మహిళ..!

ట్రేడింగ్ పేరిట వాట్సాప్ గ్రూపులో లింకు పంపి ఫేక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని చెప్పడంతో HYD అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ వారిని నమ్మింది. పలు దఫాలుగా మహిళ ఏకంగా రూ.2 కోట్లు పోగొట్టుకున్నట్లుగా తెలిపింది. చేసేదేం లేక, మోసపోయానంటూ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.
Similar News
News September 22, 2025
సంగారెడ్డిలో ప్రజావాణికి 33 ఫిర్యాదులు

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మొత్తం 33 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ప్రజలకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News September 22, 2025
ANU: దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ లు సోమవారం విడుదల చేశారు. ఎంబీఏ 600 మందికి 435మంది, ఎంసీఏ 128 మందికి 80మంది అర్హత సాధించారన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.anucde.info. నుండి ఫలితాలు పొందవచ్చు అన్నారు.
News September 22, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో UG 3వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 30, నవంబర్ 7 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 25లోపు, రూ.100 ఫైన్‌తో అక్టోబర్ 4లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.