News November 11, 2025

HYD: రూ. 2 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్ల స్వాధీనం

image

HYD పోలీసులు వివిధ నగరాల్లో ఫోన్‌ చోరీల ముఠాను చేధించారు. మొత్తం 31 మంది నిందితులను అరెస్ట్‌ చేసి, రూ.2 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌ దొంగిలించిన మొబైల్‌ ఫోన్ల IMEI నంబర్లను మార్చి ఆఫ్రికా దేశాలకు, ముఖ్యంగా సౌత్‌ సూడాన్‌కు రవాణా చేస్తూ విస్తృతంగా అక్రమ రవాణా జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ సైబరాబాద్‌, హైదరాబాద్‌ మధ్య జరిగింది.

Similar News

News November 11, 2025

HYD: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి BRS ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని BRS ప్రతినిధుల బృందం HYD BRK భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.

News November 11, 2025

HYD: అందెశ్రీని KCR అవమానిస్తే సీఎం గౌరవించారు: చనగాని

image

ప్రముఖ కవి అందెశ్రీని మాజీ సీఎం కేసీఆర్ అవమానిస్తే సీఎం రేవంత్ రెడ్డి గౌరవించారని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ‘ప్రజాపాలనలో సీఎం అందెశ్రీ పాటను గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చారు. BRS హయాంలో ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు. ప్రజా గాయకులు గద్దర్‌, అందెశ్రీని ప్రభుత్వం గౌరవించింది. సీఎం స్వయంగా అందెశ్రీ పాడె మోయడం అంటే ఆయన త్యాగాలను గౌరవించడమే’ అని అన్నారు.

News November 11, 2025

HYD: డ్యూయల్ డిగ్రీ BSC కోర్సుకు కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు PJTAU రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో గురువారం కౌన్సెలింగ్‌కి హాజరు కావాలన్నారు.