News September 4, 2025

HYD: రూ.292 కోట్లు అప్పగించాం: శిఖా గోయల్

image

సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు గతేడాది రూ.292 కోట్లు రికవరీ చేసి అప్పగించామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో సైబర్‌ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ఇప్పటివరకు 43,000 సిమ్‌లు, 14,000 IMEIలు, 8,000 URLలు బ్లాక్‌ చేశామన్నారు.

Similar News

News September 6, 2025

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ఆగిన గణపయ్య రథం..!

image

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కరీంనగర్‌లో కొలువైన 35 అడుగుల భారీ గణేష్ శోభాయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ విద్యుత్ తీగలు తొలగించకపోవడంతో శోభాయాత్ర ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారుల కోసం “మిత్రా యూత్” నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి శోభాయాత్ర సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 6, 2025

యాదాద్రి: ఉత్తమ ఉపాధ్యాయుడితి గౌరవం..!

image

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుండాల మండలం వస్తాకొండూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంపాల రాజు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు ఆయన్ను వరించింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రాజు నిన్న అవార్డు అందుకున్నారు. గత 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన అనేకమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు.

News September 6, 2025

వెనిజులపై యుద్ధానికి సిద్ధమైన అమెరికా!

image

US-వెనిజుల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వెనిజుల అధ్యక్షుడు మదురోను పదవి నుంచి దించేయాలని ప్లాన్ చేస్తున్న ట్రంప్.. 10 F-35 ఫైటర్ల జెట్లను సరిహద్దుల్లో మోహరించారు. ఆ దేశంలోని డ్రగ్స్ కార్టెల్స్‌పై మిలిటరీ స్ట్రైక్స్ చేయాలని భావిస్తున్నారు. తమ దేశంలోకి <<17597311>>డ్రగ్స్<<>> వచ్చేందుకు మదురోనే కారణమని US ఆరోపిస్తోంది. అయితే వెనిజుల చమురు సంపదను దోచుకునేందుకే యూఎస్ ఈ కుట్రలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి.