News July 21, 2024
HYD: రూ.5కే టిఫిన్..!

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.
Similar News
News January 30, 2026
కూపంలోకి కంటోన్మెంట్..? విలీనంపై బీజేపీ నిప్పులు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన GHMCలో క్రమశిక్షణ గల కంటోన్మెంట్‌ను కలపడమంటే ఆత్మహత్యాసదృశ్యమేనని BJP నాయకులు మండిపడుతున్నారు. “సొంత స్టాఫ్‌కు జీతాలివ్వలేని, ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన GHMCతో మాకేం పని?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మేయర్‌ను పప్పెట్‌గా మార్చి కౌన్సిల్ భేటీలే నిర్వహించని అస్తవ్యస్త వ్యవస్థలోకి కంటోన్మెంట్‌ను నెట్టొద్దని BJP నాయకత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై హైదరాబాదీ కామెంట్?
News January 29, 2026
HYD: వీకెండ్‌లో బెస్ట్ డెస్టినేషన్.. జింకల పార్కు

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.
News January 29, 2026
HYD: పైకం ఇంకెన్నడు ఇస్తరు?

గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు TGHB 3 ప్రాంతాల్లో 111 LIG ఫ్లాట్లకు జనవరి 6న లాటరీ తీశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్షగా నిర్ణయించగా, మొత్తం 2,663 అప్లికేషన్‌లు వచ్చాయి. ఫ్లాట్ రాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే 22 రోజులు గడిచినా ఇప్పటికీ పైకం రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తాము చెల్లించిన పైకం రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


