News August 29, 2025
HYD: రూ.5,102 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్

సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రూ.5,102 కోట్లతో నాలుగు రైల్వే లైన్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపగా.. 2026 బడ్జెట్లో దీనికి సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్లతో ప్రయాణం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్ రైల్వే ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Similar News
News August 30, 2025
ఇజ్రాయెల్ దాడుల్లో హౌతీ ప్రధాని హతం!

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హౌతీ ప్రధాని అహ్మద్ అల్-రహ్వీ హతమైనట్లు తెలుస్తోంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన దాడుల్లో అహ్మద్‌తోపాటు రక్షణమంత్రి మొహమ్మద్ అల్-అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అల్-ఘమారీ కూడా చనిపోయినట్లు సమాచారం. వీరి మరణాలపై హౌతీల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కొద్దిరోజులుగా హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేస్తోంది.
News August 30, 2025
NGKL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడుగురికి జైలు శిక్ష

నాగర్‌కర్నూల్‌లో మద్యం తాగి, వాహనాలు నడిపిన ఏడుగురికి స్థానిక న్యాయస్థానం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. జమిస్తాపూర్ గ్రామానికి చెందిన భగవంత్‌కు ఐదు రోజుల జైలు శిక్షతోపాటు రూ.2,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరో ఆరుగురికి ఒక్కరోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించిందన్నారు.
News August 30, 2025
MBNR: అడ్డకల్ PS.. SP ప్రత్యేక ఫోకస్

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.