News May 16, 2024
HYD: రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల: రోనాల్డ్ రాస్

హైదరాబాద్‌లో 201 కేసుల్లో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. దీంట్లో 192 కేసులకు సంబంధించి రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు.
Similar News
News September 14, 2025
HYD: కృష్ణా జలాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించే వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ వోహ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
News September 14, 2025
HYD: MSMEలకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవస్థాపకులను (MSME) రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బిజినెస్ నెట్‌వర్క్‌ఇంటర్నెషనల్ బీఎన్‌ఐ(BNI) ఆధ్వర్యంలో శంషాబాద్ ఎస్‌ఎస్ కన్వెన్షన్‌హాలులో ఏర్పాటు చేసిన MSME ఎక్స్‌పోను ప్రారంభించారు. పారాశ్రామికాభివృద్ధికి పక్కరాష్ట్రాల్లో ఉన్న పోర్టులనూ సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News September 14, 2025
మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్‌నుమా, ఇంజిన్‌బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్‌హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.