News September 14, 2024

HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి

image

ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.

Similar News

News December 30, 2024

న్యూ ఇయర్.. రాచకొండ సీపీ కీలక ప్రకటన

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో CP సుధీర్ బాబు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 31 DEC రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్(ORR)లో లైట్ వాహనాలకు నిషేధం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రంక్ & డ్రైవింగ్‌ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు.

News December 30, 2024

HYD: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు

image

నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

News December 30, 2024

HYD: న్యూ ఇయర్.. రిసార్టులకు ఫుల్ డిమాండ్..!

image

న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్‌పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.