News September 14, 2024

HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి

image

ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.

Similar News

News September 18, 2025

HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్‌బాడీ లభ్యం

image

అఫ్జల్‌సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News September 18, 2025

HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

image

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్‌బాగ్‌లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్‌వాంటెడ్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.

News September 18, 2025

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిలబస్ భారం తగ్గింపు !

image

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండలా ఉన్న సిలబస్ తగ్గించనుంది. గత 5ఏళ్లుగా నీట్, జేఈఈ, ఎప్సెట్ తదితర ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ భాగం నుంచి ప్రశ్నలు రాలేదో గమనించి ఆ సిలబస్‌ను తొలగించనున్నారు. అయితే ఈ మార్పులు వచ్చే విద్య సంవత్సరం (2026-27)నుంచి అమలు చేయాలని ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ఇక స్టూడెంట్స్ హ్యపీయే కదా!