News August 31, 2025
HYD: రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా బంద్

HYDలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి తెలిపింది. షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 7 గంటల వరకు మంచినీటి సరఫరా బంద్ కానుంది.
Similar News
News September 3, 2025
భిన్నత్వంలో ఏకత్వానికి హైదరాబాద్ నిదర్శనం

భిన్నత్వంలో ఏకత్వానికి HYD నిదర్శనం అనడానికి ఈ ఫొటోనే గొప్ప ఉదాహరణ. యాకుత్‌పురలో సుమారు 30 ఏళ్లుగా కటింగ్ షాప్ నడుపుతున్నట్లు ప్రదీప్ తెలిపారు. షాప్‌లో వెంకటేశ్వర స్వామి, ముస్లిం సమాజానికి ప్రత్యేకమైన కాబా ఒకే దగ్గర ఏంటని అడగగా.. ఆయన తండ్రి ఇష్టంగా పూజించేవారని, ఆయన మరణం తర్వాత షాప్, ప్రార్థన బాధ్యతలు ప్రదీప్ తీసుకున్నట్లు వివరించారు.
News September 3, 2025
కాంక్రీట్ జంగిలే.. HYDకు కారణభూతం

2020లో వచ్చిన వరదలు HYD, అటు శివారులను అతలాకుతలం చేశాయి. ఒకేరోజు 30 సెంటీమీటర్ల వర్షం నమోదు కావటంపై నాటి నుంచి IMD అధ్యయనం చేసి ఇటీవల నివేదిక రూపొందించింది. వాతావరణంలో మార్పులకు తోడు HYDలో వస్తున్న స్థానిక మార్పుల ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు, క్లౌడ్ బరస్ట్‌కు దారితీస్తోందని పేర్కొంది. HYD మొత్తం కాంక్రీట్ జంగిల్ కావడం, మరోవైపు పొల్యూషన్, పట్టణీకరణ ప్రభావమూ ఉన్నట్లు ఇది తేల్చింది.
News September 3, 2025
IT కారిడార్‌కు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు: సజ్జనార్

నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రయాణికులకు సేవలందించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడపనున్నారు. పలు ప్రధాన ప్రాంతాల నుంచి వీటిని హైటెక్ సిటీకి నడిపేలా చర్యల తీసుకుంటున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, హకీంపేట, బోడుప్పల్ నుంచి ఐటీ కారిడార్ (విప్రో, వేవ్ రాక్, కోకాపేట, టీహబ్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ)కు కనెక్టివిటీ పెంచుతామని వివరించారు.