News February 6, 2025

HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

image

కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.

Similar News

News December 30, 2025

NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

image

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ ‌న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

News December 30, 2025

HYD: టోల్‌ప్లాజాలు ఉండవిక.. RRRకు శాటిలైట్‌

image

హైవే మీద టోల్ కట్టడానికి కారు ఆపే రోజులకు ఇక చరమగీతం పాడబోతున్నారు. RRR వెంబడి ఎక్కడా మీకు టోల్ గేట్లు కనిపించవు. ఇది FREE అనుకుంటే పొరపాటే. కేంద్రం ఇక్కడ Global Navigation Satellite System శాటిలైట్ ట్రాకింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రోడ్డు ఎక్కిన సెకను నుంచే ఆకాశంలో ఉన్న శాటిలైట్ మీ కారుని ఫాలో అవుతుంది. ప్రయాణించిన ప్రతి మీటరుకు లెక్క కట్టి, నేరుగా అకౌంట్ నుంచి పైసలు లాగేస్తుంది.

News December 30, 2025

HYD: ASBL ఫ్యామిలీ డే 2025

image

ASBL ఫ్యామిలీ డే 2025.. ASBL ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చింది. ఇది నమ్మకం, ఉమ్మడి విలువలు, సామూహిక అభివృద్ధికై జరుపుకున్న వేడుక. వ్యవస్థాపకులు, CEO అజితేష్ కొరుపోలు గతం, భవిష్యత్తు గురించి మనస్ఫూర్తిగా, ఆత్మీయంగా వారి భావాలను పంచుకున్నారు. ఈ వేడుక ఒక నమ్మకాన్ని బలపరిచిందన్నారు. ASBL కేవలం ప్రాజెక్టులపై మాత్రమే కాదు, నమ్మకంపై నిర్మించబడిందని అజితేష్ కొరుపోలు అన్నారు.