News February 6, 2025
HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.
Similar News
News December 30, 2025
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మారుస్తూ… తుది నిర్ణయం

అన్నమయ్య జిల్లా పరిపాలన పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదలచేసింది. మదనపల్లె జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మదనపల్లె, రాయచోటి రెవెన్యూ డివిజన్లతో పాటు కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈజిల్లాలో 25మండలాలు ఉండనున్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల సరిహద్దులను సవరించారు.
News December 30, 2025
యూరియా కోసం క్యూలో ఉండక్కర్లేదు: అదనపు కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ శిక్షణలో మాట్లాడుతూ.. సాంకేతికతతో పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
సంగారెడ్డి జిల్లా ఎస్పీ WARNING

ఈనెల 31 సాయంత్రం తర్వాత ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకు పంపిస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం హెచ్చరించారు. కొత్త సంవత్సరం పేరుతో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నూతన సంవత్సరం వేడుకలకు డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టం వినిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


