News October 22, 2025
HYD: రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం: పొంగులేటి

రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News October 22, 2025
పల్నాడు శైవ క్షేత్రాలలో కార్తీక మాసం సందడి

పల్నాడులో ప్రముఖ శైవ క్షేత్రాలైన గుత్తికొండ, దైద, సత్రశాలలో కార్తీక మాసం సందడి నెలకొంది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దైద, సత్రశాల ఆలయాలు కృష్ణా నది పక్కనే ఉండడంతో నదిలో మహిళలు ప్రత్యేక పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గుత్తికొండ ఓంకారేశ్వరుడు, దైద అమరలింగేశ్వర స్వామి, సత్రశాల మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
News October 22, 2025
GNT: ఓ శకం ప్రారంభమై నేటికి పదేళ్లు

2014లో ఏపీ విభజన ఫలితంగా మిగిలిన రాష్ట్రానికి రాజధాని లేక నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబర్ 22న దసరా రోజున జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. 2017 నుంచి వెలగపూడిలో పనిచేయడం ప్రారంభించింది.
News October 22, 2025
చిత్తూరు CDCMS పర్సన్ ఇన్‌ఛార్జ్ జేసీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.