News May 11, 2024
HYD: రైల్వే పట్టాలు దాటేటప్పుడు జర జాగ్రత్త!

రైల్వే పట్టాలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోతాయని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు హైటెక్ సిటీ-హఫీజ్‌పేట్ మధ్యలో ఓ గుర్తుతెలియని వ్యక్తి(35) రైలు ఢీకొని మృతిచెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసులు తెలిపారు. ఉందానగర్-బుద్వేల్ లైన్‌లో మరో వ్యక్తి(25) ఇలాగే చనిపోయాడని హెడ్ కానిస్టేబుల్ చిమ్నా తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 3, 2025
HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.
News November 3, 2025
మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.


