News March 26, 2025

HYD: రైళ్లలో హై అలర్ట్.. ఎక్కడికక్కడ పోలీసులు!

image

MMTS రైలులో జరిగిన ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. HYD, సికింద్రాబాద్ సహా SCR పరిధిలో నడిచే అన్ని రైళ్లలో ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతపై ఫోకస్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

Similar News

News March 29, 2025

ఉగాది పురస్కారానికి ఎంపికైన”పుట్టం రాజు”

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారం 2025కు అద్దంకికి చెందిన సాహితీవేత్త పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి ఎంపికైనట్లు రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృత సమితి శనివారం వెల్లడించింది. పుట్టం రాజు సాహిత్య రంగంలో విశేష సేవలు అందించి పలు పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని పుట్టంరాజు అందుకోనున్నారు

News March 29, 2025

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే వాట్సాప్‌లో స్టేటస్ ఫొటోలకు మ్యూజిక్ యాడ్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో లైసెన్స్డ్ ట్రాక్స్ మాత్రమే వాడొచ్చు. సొంత పాటలను అప్డేట్ చేస్తామంటే అనుమతించదు. ఈ ఫీచర్ వాడేందుకు వాట్సాప్ ఓపెన్ చేయాలి> న్యూ స్టేటస్ క్లిక్ చేయాలి> ఫొటో/ వీడియో తీసుకోవాలి> పైన మ్యూజిక్ బటన్ నొక్కాలి> మ్యూజిక్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది> మీకు నచ్చిన పాట సెలక్ట్ చేసుకోవాలి.

News March 29, 2025

సానియా సోదరి ఎక్స్‌పోలో కాల్పుల కలకలం

image

TG: HYD గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఏర్పాటుచేసిన ఓ ఎక్స్‌పోలో ఇద్దరు షాపు యజమానుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎక్స్‌పోలో భద్రతను పెంచారు.

error: Content is protected !!