News October 23, 2025
HYD: రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలు.. మహిళల అరెస్ట్

HYD కూకట్‌పల్లి PS పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో ఎస్ఐ నరసింహ ఆధ్వర్యంలో పది మంది మహిళలను అరెస్ట్ చేశారు. రోడ్లపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. పది మందిని స్థానిక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, సత్ప్రవర్తనలో భాగంగా బైండ్ ఓవర్ చేయగా ఇద్దరు మహిళలను 7 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News October 24, 2025
ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు అవకాశం ఉందన్నారు.
News October 24, 2025
పెండింగ్ కేసులు పరిష్కరించాలి: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పోలీస్ అధికారులతో క్రైమ్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణాలు, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజాశాంతి భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించారు. కేసులు పెండింగ్లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 24, 2025
జగిత్యాల: అక్టోబర్ 27 లాస్ట్ డేట్..!

జగిత్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు నామినల్ రోల్(NR) కరెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ 27 చివరి తేదీ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి.నారాయణ తెలిపారు. గ్రూప్, సెకండ్ లాంగ్వేజ్ లేదా వివరాల్లో సవరణల కోసం కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. తరువాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. వివరాలు వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/dvc.doలో చూడొచ్చన్నారు.