News May 22, 2024
HYD: రోడ్లపై పేరుకుపోయిన ఇసుక మేటలు

ఇటీవలే కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఇసుక కొట్టుకురావడంతో అవి కట్టగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి. అంతేకాకుండా దుమ్ము, ధూళితో అసౌకర్యంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ఒకానొక సందర్భంలో స్కిడ్ అయి పడిపోతున్నామని అంటున్నారు. ఇసుక మేటలను తొలగించాలని కోరుతున్నారు.
Similar News
News September 14, 2025
HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
News September 14, 2025
ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.
News September 14, 2025
HYD: ఈ ఫార్ములా కేస్.. విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి బాల్

గత ప్రభుత్వం HYDలో నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసులో భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి విచారణకు అనుమతివ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ రిపోర్టును విజిలెన్స్ కమిషన్‌కు పంపి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం కోరింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసుపై చర్యలు తీసుకోనుంది.