News May 6, 2024
HYD: రోహిత్ మరణ నివేదికపై ఎమ్మెల్యే విస్మయం

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రోహిత్ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘వర్సిటీ వీసీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు.
Similar News
News September 13, 2025
హైదరాబాద్ చుట్టూ మూడు రైల్వే టెర్మినల్స్

హైదరాబాద్ చుట్టూ కొత్తగా మూడు రైల్వే టెర్మినల్స్‌ను నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఈ టెర్మినల్స్ నిర్మాణం చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. ఈ వివరాలను రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News September 13, 2025
HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.
News September 13, 2025
గాంధీలో ఉత్తమ సేవలకు సహకారం: జూడాలు

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణిని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆసుపత్రి సేవల మెరుగుదలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే జూనియర్ వైద్యుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో జూడా అధ్యక్షుడు డా.అజయ్‌కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.