News September 7, 2024

HYD: లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: సీఎండీ

image

విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-234548845, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT

Similar News

News September 17, 2025

HYD: పసిప్రాయంలోనే.. పోరాటంలో

image

1948 SEP 17..గౌలీపురా గల్లీ జనంతో నిండింది. అందరి దృష్టి స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్‌ బహదూర్‌ గౌర్‌ చెల్లెలు అవ్‌ధీశ్‌ రాణి ఇంటి గుమ్మానికి వేలాడుతున్న రేడియోపైనే ఉంది. ‘HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది’ అని ప్రకటించగానే ఎగిరి గంతేశారు. దీపావళికి ఇంటికొచ్చిన మగ్దూం, జావేద్‌ రిజ్వీలను పోలీసుల నుంచి కాపాడింది. ‘పాల్‌రాబ్సన్‌’ కోడ్‌తో సమరయోధులకు భోజనం, సమాచారం చేరవేసి పోరాటంలో 8ఏళ్లకే భాగమైంది.

News September 17, 2025

జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.