News September 3, 2025
HYD: లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

HYDలో GST/కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
Similar News
News September 4, 2025
HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేల జరిమానా

బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై HMWSSB చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ఇక ఉదయాన్నే ఈ నీటితో రోడ్లు, ఇంటిపరిసరాలు కడిగేవారూ.. జాగ్రత్త నెక్ట్స్ మీ వంతే.
News September 4, 2025
HYDలో 6వ తేదిన బిగ్గెస్ట్ TASK

నగరంలో ఈ నెల 6న జరిగే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పోలీసులకు బిగ్గెస్ట్ టాస్క్. భక్తులకు ఇది అతిపెద్ద శోభాయాత్ర. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు అధికారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ఏర్పాట్లపై కసరత్తులు చేసి పక్కా రూట్ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఖైరతాబాద్- పాత సైఫాబాద్ PS- ఇక్బాల్ మినార్- తెలుగు తల్లివిగ్రహం- అంబేడ్కర్ విగ్రహం- ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనానికి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News September 4, 2025
HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.