News August 31, 2025
HYD: లడ్డూ దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

వినాయకచవితి నవరాత్రుల వేళ లడ్డూ దొంగల బెడద పెరిగింది. మీర్‌పేట PS పరిధి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్ కాలనీలో ఏకంగా 4 మండపాల్లో గణపతి లడ్డూలను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకులు అదును చూసి చోరీ చేశారు. దీనిపై స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు. మండపంలో నిద్రించే వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News August 31, 2025
HYD: పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన SCR

అనివార్య కారణాల వళ్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా HYD SCR అధికారులు తెలిపారు. పూర్ణ నుంచి అకోలా, అకోలా నుంచి పూర్ణా వెళ్లే 77613 రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జైపూర్ హైదరాబాద్, తిరుపతి, అదిలాబాద్ రైళ్లను సైతం డైవర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.
News August 31, 2025
HYD: రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా బంద్

HYDలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి తెలిపింది. షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 7 గంటల వరకు మంచినీటి సరఫరా బంద్ కానుంది.
News August 31, 2025
HYD: GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు.!

కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గుల్షాన్ బంబాత్ చిన్న గణపతి విగ్రహాల ద్వారానే ఎక్కువ విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటాయని అభిప్రాయపడ్డారు. చెరువులను కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆమె రాత్రిపూట కూడా చెరువు దగ్గరే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు కలుషితం కావొద్దంటే, మనందరం మారుదాం” అని ఆమె పేర్కొన్నారు