News October 7, 2025

HYD: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్

image

HYD మూసాపేటలో నిన్న <<17932066>>కమలేశ్ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కమలేశ్ 3 నెలల క్రితం HYD వచ్చాడు. కాగా తన సొంతూరుకు చెందిన ఓ యువతిని కొన్నాళ్లుగా అతడు లవ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చేతులను బ్లేడ్‌తో కోసుకున్న ఫొటోలను యువతికి వాట్సాప్‌లో పంపి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ గదిలో ఉరేసుకున్నాడు. అయితే అతడి ప్రేమికురాలు సైతం సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది.

Similar News

News October 7, 2025

BREAKING: హైదరాబాద్‌లో IT అధికారుల సోదాలు

image

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. కొండాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఐటీ సోదాలు జరగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లుగా తెలియడంతో అనధికారిక లావాదేవీల ఆధారంగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 7, 2025

HYDలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి..!

image

HYD బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ ఐటీఐ బీఈ, బీటెక్, ఎంఈలో పాసై, అనుభవం ఉండాలి. వయసు 45 ఏళ్లు మించొద్దు. అర్హత గల వారు అక్టోబర్ 10, 13, 14వ తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://www.citd.in/news-and-events.php

News October 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ ఫుల్ ఫోకస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రకటన వెలువడడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. రెండు, మూడు రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ బస్తీబాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.